గురి తప్పని కుమ్‌కుమ్
- యువ ఆర్చరీ ప్లేయర్ సంచలనం
- వ్యక్తిగత విభాగంలో స్వర్ణం
- వాడేసిన విల్లుతో శిక్షణ
నగోయా, అక్టోబర్ 3 : ఆసియా క్రీడల ఆర్చరీలో భారత యువ క్రీడాకారణి కుమ్‌కుమ్ మోహద్(Indian archer Kumkum Mohad) చరిత్ర సృష్టించింది. మహి ళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలోనే తొలి స్వర్ణా న్ని అందించింది.ఆసియా క్రీడల చరిత్రలోనే ఈ విభాగంలో భారత్‌కు లభించిన మొట్టమొదటి పసిడి పతకం ఇదే. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన 17 ఏళ్ల కుమ్‌కుమ్ 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోటాను కూడా దక్కించుకుంది.
ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. స్కోర్లు 5- టై అయి న దశలో కుమ్‌కుమ్ షూటౌట్లో 10 పాయిం ట్లు సాధించింది. ఇక వత్తిడిలోనైన ప్రత్యర్థి ఓహ్ మాత్రం కేవలం 8 పాయింట్లు మాత్ర మే కొట్టగలిగింది. ఈ పోటీల్లో కుమ్‌కుమ్ అద్భుతంగా రాణించింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై 6-2 తేడా స్కోరుతో గెలిచింది.
ఈ వ్యక్తిగత స్వర్ణంతో పాటు, ఆమె మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్లో (అంకిత భకత్, కీర్తి శర్మలతో కలిసి) బంగారు పతకం, అలాగే ధీరజ్ బొమ్మదేవరతో కలిసి మికస్డ్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించి ఈ టోర్నీలో మొత్తం 3 పతకాలతో మెరిసింది. ఆమె నేపథ్యం చూస్తే ఎంతోమందికి స్ఫూ ర్తిగా నిలుస్తుంది.
కుమ్‌కుమ్ తండ్రి స్వీట్ షాపుల కోసం అట్టపెట్టెలు తయారు చేసే ఒక సాధారణ కార్మికుడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుటుంబం ఆమెను ఎంతగానో ప్రోత్సహించింది.కేవలం రూ.3 వేలు విలువైన ఒక సాధారణ కర్ర విల్లుతో కెరీర్ ప్రారంభించిన కుమ్‌కుమ్, ఆ తర్వాత వాడేసిన విల్లుతో శిక్షణ పొంది ప్ర పంచకప్ వంటి పెద్ద వేదికలపై అగ్రశ్రేణి క్రీ డాకారిణిలను ఓడించింది. మరోవైపు మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ తృటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఫైనల్లో ధీరజ్ బొమ్మదేవర, కుమ్‌కుమ్ జోడీ చైనా చేతిలో పరాజయం పాలైంది.