శతక్కొట్టిన రింకూ సింగ్

19-10-2026 | 05:15am
  1. గోవాపై కీలక ఇన్నింగ్స్
  2. ప్రియాన్ష్ ఆర్య 199
  3. హైదరాబాద్ 275 ఆలౌట్
  4. రంజీ ట్రోఫీ రౌండప్

కాన్పూర్, అక్టోబర్ 18 : రంజీ ట్రోఫీలో(Ranji Trophy) యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. టీ మిండియాకు దూరమైన రింకూ సింగ్ దేశవాళీ క్రికెట్‌లో ఫామ్ అందుకున్నాడు. వరు సగా రెండో శతకం బాదాడు. మొన్న బిహార్‌పై సెంచరీ చేసిన రింకూ తాజాగా గోవాతో మ్యాచ్‌లోనూ శతక్కొట్టాడు. మొదట బ్యా టింగ్‌కు దిగిన యూపీ 90 పరుగులకే 4 వికె ట్లు కోల్పోయింది. ఈ దశలో రింకూ వీరోచిత శతకంతో జట్టును ఆదుకున్నాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా సెంచరీ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

137 పరుగుల దగ్గర 9వ వికెట్ పడి నా రింకూ పోరాడాడు. చివరి వికెట్‌కు వన్ష్ చౌదరితో 49 పరుగులు జోడించాడు. 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రింకూ పోరాటంతోనే యూపీ 202 పరుగులు చేయగలిగింది. త ర్వాత ఆటముగిసే సమయానికి గోవా వికెట్ కోల్పోకుండా 43 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ యువ క్రికెటర్ ప్రియాన్ష్ ఆర్య సెంచరీతో కదం తొక్కాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ప్రియాన్ష్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒక పరుగు తేడాతో డబుల్ సెం చరీ చేజార్చుకున్నాడు.

24 ఫోర్లు, 6 సిక్సర్లతో 199 పరుగులకు ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ ఆయుశ్ బదోనీ కూడా సెంచరీతో చెలరేగడంతో ఢిల్లీ భారీస్కోరు సాధించింది. తొలిరోజు ఆటముగిసే సమయానికి 4 వికెట్లకు 381 పరుగులు చేసింది. బదోనీ 115, సుమిత్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రాతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 275 పరుగు లకు ఆలౌటైంది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(42),అభిరథ్ రెడ్డి(67) తొలి వికెట్‌కు 109 పరుగులతో మంచి ఆరంభానన్నిచ్చినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. ఆంధ్రా బౌలర్లలో విజయ్ 4, లలిత్ మోహన్ 3 , సౌరవ్ కుమార్ 3 వికెట్లు తీసారు. ఆంధ్రా తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 9 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు