ఆశా కార్యకర్తల సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి
తుంగతుర్తి (విజయక్రాంతి) : ఆశా కార్యకర్తల(ASHA workers) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్, మండల ఆశా వర్కర్స్ యూనియన్(ASHA Workers' Union) అధ్యక్షురాలు మేకల జయమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో మండల వైద్యాధికారి లింగమూర్తిని కలిసి ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని తలపెట్టిన సమ్మె నోటీసులు అందజేసి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో(Congress government election manifesto) ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న ఇప్పటికి అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. ఆశ కార్యకర్తలకు నెలకు కనీస వేతనం రూ.18వేలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు రమ, గాజుల నాగలక్ష్మి, యాకలక్ష్మి, సునీత, సరస్వతి , లీల, రమ తదితరులు పాల్గొన్నారు.