అన్నదానం మహా పుణ్యకార్యం

21-09-2026 | 06:18pm

కోదాడ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమబాబు

కోదాడ,(విజయక్రాంతి): అన్నదానం చేయడం మహా పుణ్యకార్యమని కోదాడ మున్సిపల్(Kodad Municipal) చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమబాబు(chairperson erneni kusumababu) అన్నారు. పట్టణంలోని పెరిక నగర్‌లో సోమవారం మైలారపు శెట్టి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి(food distribution program) ఆమె ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదన్నారు.

సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన మైలారపు శెట్టి భాస్కర్‌రావును ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో కందిబండ ఎలమందరావు, చింతల శ్రీనివాసరావు, రమేష్, , విష్ణుమూర్తి, సైదులు, వెంకన్న, హేమంత్, శ్రీనివాస్ చారి, సైదారావు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు