అంకుసాపూర్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
21-09-2026 | 06:37pm
తంగళ్లపల్లి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో((Ankusapur Village)కేడీసీసీ బ్యాంక్(KDCC Bank) ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ లావాదేవీలపై కళాకారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ లావాదేవీల వినియోగం, ఆర్థిక లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఆలీ, ఫీల్డ్ ఆఫీసర్ నాగరాజు, సర్పంచ్ అంచ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు సావణపల్లి బాలయ్య, రేగుల రాజు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుర్మ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.