గడ్డిపల్లిలో మంత్రి ఉత్తమ్‌కు ఘన స్వాగతం

23-09-2026 | 10:58pm

గరిడేపల్లి సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని గడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఘన స్వాగతం పలికారు. నేరేడుచర్ల మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొనేందుకు మంత్రి హెలికాప్టర్‌లో గడ్డిపల్లికి చేరుకున్నారు.

హెలిప్యాడ్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు మంత్రికి పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు.అనంతరం మంత్రి ప్రత్యేక కాన్వాయ్‌లో నేరేడుచర్ల మండలంలోని మేడారం గ్రామానికి బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో సుందరి నాగేశ్వరరావు, శోభన్‌బాబు, గుండు రామాంజిగౌడ్, పాకాల పరమేష్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు