డివిజన్ స్థాయి కబడ్డీలో గురుకుల విద్యార్థుల ప్రభంజనం
జిల్లా స్థాయి పోటీలకు నలుగురు ఆర్ పి ఆర్ పి గురుకుల విద్యార్థుల ఎంపిక
అభినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి
తుంగతుర్తి (విజయక్రాంతి): స్కూల్ గేమ్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో నూతనకల్ మండల పరిధిలోని వెంకేపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గస్థాయి కబడ్డీ టోర్నమెంట్ 2026 అండర్–17 కబడ్డీ పోటీల్లో తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల(Social Welfare Girls' Gurukul School) జట్టు ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన పోటీల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తుంగతుర్తి జట్టు విజేతగా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది.
ఈ పోటీల్లో తుంగతుర్తి పాఠశాలకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జిల్లా స్థాయి అండర్–17 కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు మరింతగా కృషి చేసి పాఠశాలకు, తుంగతుర్తి ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులకు క్రీడాభిమానులు అభినందనలు తెలిపారు.క్రీడల్లో విజయం సాధిస్తూ జిల్లా స్థాయిలోనూ సత్తా చాటాలి” అని ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.