జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
18-09-2026 | 02:07pm
డీసీసీ సెక్రటరీ వేల్పుల రమేష్
జాజిరెడ్డిగూడెం: కోదాడ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ సీసీఆర్ విద్యా నిలయంలో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్ మేళా(Mega Job Fair)ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని డీసీసీ సెక్రటరీ వేల్పుల రమేష్(DCC Secretary Velpula Ramesh) పిలుపునిచ్చారు.శుక్రవారం అర్వపల్లిలో మాట్లాడుతూ... నిరుద్యోగ యువత(Unemployed youth)కు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర నీటిపారుదల,పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారని యువత తమ విద్యార్హతల సర్టిఫికెట్లు,బయోడేటా వంటి పూర్తి వివరాలతో హాజరు కావాలని సూచించారు.