అమీనాబాద్‌లో అంగన్వాడి భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

03-10-2026 | 11:07pm

 పద్మావతి రెడ్డి

కోదాడ,అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో(Aminabad Village) ఉపాధి హామీ నిధులు రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించిన అంగన్వాడి  భవనాన్ని(Anganwadi building) కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(Kodad MLA Padmavathi Reddy) శనివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన అంగన్వాడి  భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందించేందుకు అంగన్వాడి  కేంద్రాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

నూతన భవనం అందుబాటులోకి రావడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అంగన్వాడి ల ద్వారా సేవలు మరింత సౌకర్యవంతంగా అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస్ రెడ్డి, బుర్ర పుల్లారెడ్డి, కొండపల్లి వాసు, బాబు నాయక్, సర్పంచ్ గోపతి లలిత, మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరావు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాదే కోటేశ్వరావు, తిరిపిశెట్టి శ్రీరామయ్య, రామినేని శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అంగన్వాడి  సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు