మోతె మండలానికి ఎమ్మెల్యే రాక

01-11-2026 | 06:22pm

* మూడు గ్రామాల్లో పరామర్శలు..

* విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

మోతె, నవంబర్ 01 (విజయక్రాంతి): కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) సోమవారం మోతె మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రాయికుంట తండాలో భూక్య బిచ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. 11:30 గంటలకు రాందాస్ తండాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూక్య దస్రు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాంపురం తండాలో అనారోగ్యంతో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొర్ర రాములు నాయక్‌ను పరామర్శిస్తారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి కోరారు.

మరిన్ని వార్తలు