ఆదివాసీ కోలవార్ సంక్షేమ సంఘం మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

01-11-2026 | 07:49pm

వేమనపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసీ కోలవార్ సంక్షేమ సంఘం(Adivasi Kolawar Welfare Committee) రాష్ట్ర, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా దూలం చంద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా మనేపల్లి బాపూ, ఉపాధ్యక్షులుగా పాయల లచ్చన్న, కురుమ లక్ష్మయ్య, సహాయ కార్యదర్శిగా కొడుపే లచ్చన్న, ప్రచార కార్యదర్శిగా బుర్రి శీను, సాంస్కృతిక కార్యదర్శిగా ఎడ్ల శ్రీనివాస్, కోశాధికారిగా జంపం సంతోష్‌లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ కోలవార్‌ల ఐక్యత, అభ్యున్నతి, హక్కుల పరిరక్షణకు నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు బుర్సా పోచయ్య, జిల్లా అధ్యక్షుడు కమ్మరి భీమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూర్మ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దల వెంకటేష్, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి విజయ్, ఉపాధ్యక్షుడు బండి రమేష్, నాయకులు ఆస్తి చంద్, జంపం శ్రీకాంత్, శేగం చంద్రయ్య, ఆత్రం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు