సేవా స్ఫూర్తితో ‘మై భారత్’.. యువతలో చైతన్యం

02-10-2026 | 03:30pm

విద్యార్థులకు ఆరోగ్యం, స్వచ్ఛతపై అవగాహన.. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు

చివ్వెంల, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించిన ‘సేవా పఖ్వాడా’లో భాగంగా ‘మై భారత్’ వాలంటీర్ వెంకట భవాని దిగుటి(My Bharat volunteer Venkata Bhavani Diguti ) ఆధ్వర్యంలో పలు సేవా, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భవాని, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీవాణిని కలిసి వారి సహకారంతో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ నిర్మాణంలో యువత పాత్రపై వారికి వివరించారు.

అలాగే పలు గ్రామ పంచాయతీలను సందర్శించి ప్రజలతో కలిసి స్వచ్ఛ భారత్, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా వెంకట భవాని దిగుటి మాట్లాడుతూ దేశ ప్రగతిలో యువత పాత్ర కీలకమని, సేవా కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొని సమాజ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ‘సేవా పఖ్వాడా’తో ఏర్పడిన సేవా స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు