స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
మఠంపల్లి,(విజయక్రాంతి): మండల పరిధిలోని కొత్త దొనబండ తండా(Kotha Donabanda Tanda) గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్, డీలర్ పాండుతో కలిసి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను(Smart Ration Cards) పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు, ఇతర సంక్షేమ పథకాల(Welfare schemes) ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉంటుంది.
అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్, ఉపసర్పంచ్ ధరవతు నితిన్, వార్డు సభ్యులు యలమంద, నాగేశ్వరరావు, బాలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.