విద్యార్థులు చదువుతోపాటు దేశభక్తిని అలవర్చుకోవాలి

09-10-2026 | 10:42pm

భాజపా నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కొణతం నాగిరెడ్డి 

నేరేడుచర్ల,అక్టోబర్09(విజయక్రాంతి) : విద్యార్థులు చదువుతోపాటు(Students' education) దేశభక్తిని కూడా అలవర్చుకొని దేశ సంక్షేమం కోసం కృషి చేయాలని నేరేడుచర్ల(Nereducherla) భాజపా పట్టణ అధ్యక్షులు కొనతం నాగిరెడ్డి(Konatham Nagireddy) అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) 76వ జన్మదినo మరియు 25 సంవత్సరాల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భాన స్థానిక శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో  వ్యాస రచన, చిత్రలేఖనం నిర్వహించి పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతి ప్రధానం సందర్భంగా అయన మాట్లాడుతూ...విద్యార్థులు మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని పొందాలని దేశ సంక్షేమం కొరకు అహర్నిశలు పాటుపడాలన్నారు.

భాజపా జిల్లా ట్రెజరర్ తాళ్ల నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబంలో ఎవరి పుట్టినరోజు వచ్చినా వారు ఒక మొక్క నాటి దాని పూర్తి సంరక్షణ బాధ్యత తీసుకొని పర్యావరణానికి కృషి చేయాలని , పర్యావరణం కాపాడుకోకపోతే మనిషి మనుగడ అంధకారం అవుతుందన్నారు.వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి ఎం.ప్రవస్తి, ద్వితీయ బహుమతి  జె.మౌనిక, తృతీయ బహుమతి కె.సాయి చరణ్, అలాగే డ్రాయింగ్ పోటీలో ప్రథమ బహుమతి పి.భవ్యశ్రీ, ద్వితీయ బహుమతి డి.సత్యహని, తృతీయ బహుమతి పి.శీర్షిక లు బహుమతులు గెలుచుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొనతం సీతారాoరెడ్డి,జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొప్పు లక్ష్మీ నారాయణ, జిల్లా దివ్యాంగ కన్వీనర్ ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కాలం నాగయ్య, పట్టణ నాయకులు వెన్నం సురేష్ నాయుడు, దేవిరెడ్డి నాగిరెడ్డిలు పాల్గొని బహుమతులు అందించారు.

మరిన్ని వార్తలు