సీఎం వ్యాఖ్యలపై బీజేపీ నిరసన

01-10-2026 | 06:40pm

శ్రీరంగాపూర్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ఆధ్వర్యంలో గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ(BJP) నాయకులు మాట్లాడుతూ “జై శ్రీరామ్” అంటే గొప్పవారి దేవుడు, “ఓం నమఃశివాయ” అంటే పేదల దేవుడు అంటూ దేవుళ్లను వేరు చేసి మాట్లాడటం తగదన్నారు.

శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు రామేశ్వరంలో శివుని ప్రతిష్ఠించి శివానుగ్రహం పొందిన విషయాన్ని గుర్తు చేశారు. దేవుళ్లను రాజకీయాలకు ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నలవోతుల విష్ణువర్ధన్ నాయుడు, ముఖ్య అతిథి జిల్లా ఓబీసీ మండల ఇన్‌చార్జి వినోద్ సాగర్, మండల ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, రఘు, జిల్లా ఓబీసీ కార్యదర్శి శిట్టి రాజుల శివ, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యుడు వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు