ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు
హైదరాబాద్: సెంట్రల్ హైదరాబాద్‌లో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద ఏఎస్‌బీఎల్ సంస్థ చేపట్టిన తొలి నివాస ప్రాజెక్టు ‘ఏఎస్‌బీఎల్ లెగసీ(ASBL Legacy)’ ప్రారంభోత్సవ రోజే రూ.800 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా, తొలి పూర్తి గేటెడ్ కమ్యూనిటీగా నిలవనుంది.
హైదరాబాద్‌లోని అత్యంత సుస్థిరమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోకి కంపెనీ ప్రవేశించడానికి ఈ ప్రాజెక్టు నాంది పలికింది. ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఏఎస్‌బీఎల్ ‘హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ’ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద గృహ కొనుగోలుదారులు ఇంటిని బుక్ చేసుకుని, ఇంటిని అప్పగించే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నిర్మాణ సమయంలో వినియోగదారులు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ఆ కాలమంతా కంపెనీనే భరిస్తుంది.
మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ప్రీ-ఈఎంఐ ఆఫర్లు నిర్మాణంలో ఒక నిర్దిష్ట దశ వరకు మాత్రమే, సాధారణంగా తొలి స్లాబ్ పూర్తయ్యే వరకు మాత్రమే ఊరటనిస్తాయి. అయితే, ఏఎస్‌బీఎల్ ఆఫర్ నిర్మాణ కాలం మొత్తం ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద కొనుగోలుదారులు బుకింగ్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇంటిని అప్పగిస్తున్నట్లు అధికారికంగా సమాచారం ఇచ్చే వరకు వడ్డీ భారాన్ని ఏఎస్‌బీఎల్ భరిస్తుంది. మిగిలిన ఇంటి ధరను అప్పగించే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి కోసం వేచి చూసే సమయంలో కొనుగోలుదారులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ ఆఫర్ లక్ష్యం.
సుమారు 7.97 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఏఎస్‌బీఎల్ లెగసీలో జీ+50 అంతస్తుల ఎత్తుతో మూడు నివాస టవర్లు ఉంటాయి. ఇందులో 1,970 నుంచి 3,015 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లు ను అందిస్తుంది. వీటి ధరలు రూ.1.99 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి.
ఈ ప్రాజెక్టులో 73.25 శాతం ఖాళీ స్థలం, 74 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్‌హౌస్, సుమారు 1.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇతర సదుపాయాలు ఉన్నాయి. 50కి పైగా ఆధునిక సదుపాయాలను ఇక్కడ కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ప్రత్యేకతలలో డబుల్ హైట్ లాబీ, రెండు మీటర్ల వెడల్పుతో కారిడార్లు, ప్రతి అంతస్తులో ఒక్కో యూనిట్‌కు ఒక లిఫ్ట్, డ్యూయల్ సింక్ స్పేస్, అవుట్‌డోర్ లివింగ్ ఏరియాలు, మాస్టర్ బెడ్‌రూమ్‌లు, సౌకర్యవంతమైన వంటగదులు, యుటిలిటీ ప్రాంతాలు వున్నాయి.