బిస్లరీ నీరు సురక్షితమే

23-11-2026 | 10:44am

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ (Bisleri) తమ తాగునీటి నాణ్యతపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్పందించింది. తమ నీరు సురక్షితం కాదంటూ భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) చేసిన ప్రకటనపై కంపెనీ వివరణ ఇచ్చింది. తమ ఉత్పత్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడటం లేదని స్పష్టం చేసింది.

నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రతి నీటి నమూనాకు ఏకంగా 90 రకాల పరీక్షలు (Quality Tests) నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఈ పరీక్షల ద్వారా నీటిలోని వివిధ రసాయనాలు, ఇతర ప్రమాణాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. కఠినమైన నాణ్యతా నియంత్రణ (Quality Control) విధానాలను అనుసరిస్తూ వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని పేర్కొంది. తాజాగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పరీక్షల్లో హానికర రసాయనాలు ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో బిస్లరీ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని వార్తలు