ప్రకృతి సాగుతోనే భూసార పరిరక్షణ
కొండాపూర్లో ఖేతీ బచావో, జాతీయ ప్రకృతి
వ్యవసాయ మిషన్పై రైతులకు అవగాహన సదస్సు
నల్లబెల్లి, నవంబర్ 6 (విజయక్రాంతి ): సాగు ఖర్చులను(cultivation costs) తగ్గించుకొని నేల ఆరోగ్యాన్ని(Soil Health) కాపాడుకోవడానికి ప్రతీ రైతు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని వ్యవసాయ అధికారులు(Agricultural Officers) సూచించారు. నల్లబెల్లి మండలం(Nallabelli Mandal) కొండాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్(National Mission on Natural Farming)’, ‘ఖేతీ బచావో అభియాన్’పై రైతులకు శుక్రవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య, వేప కషాయాల వంటి సహజ ఉత్పాదకాలను వినియోగించాలని అవగాహన కల్పించారు. రాబోయే యాసంగిలో ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నీటి లభ్యతకు అనుగుణంగా వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు సాగు చేయాలన్నారు.
భావి తరాలకు సారవంతమైన భూములను అందించేలా భూసార పరిరక్షణ, నేల కోత నివారణ చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్బరబోయిన లలిత, వ్యవసాయ విస్తరణ అధికారి విశ్వ భాను, రైతు సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.