27 వారాల శిశువుకు హెర్నియా శస్త్రచికిత్స

02-10-2026 | 05:05am

మెడికవర్ హాస్పిటల్ వైద్యుల ఘనత

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): కేవలం 27 వారాలకే పుట్టి, పుట్టినప్పుడు 700 గ్రాముల బరువున్న ఓ ప్రీమెచ్యూర్ శిశువుకు జనరల్ అనస్థీషియా, సెడేషన్ ఇవ్వకుండా వైద్యులు విజయవంతంగా హెర్నియా శస్త్రచికిత్స(Hernia Surgery) నిర్వహించారు. హైదరాబాద్‌లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్(Medicover Hospitals) వైద్యులు ప్రత్యేకమైన అవేక్ కాడల్ అనస్థీషియా పద్ధతిని ఉపయోగించి రెండు వైపులా ఉన్న ఇంగ్వైనల్ హెర్నియాను విజయవ ంతంగా సరిచేశారు.  దాదాపు రెండు నెలల పాటు ప్రత్యేకమైన నియోనేటల్ కేర్లో చికిత్స అందించిన అనంతరం శిశువు 2.7 కిలోల బరువుకు చేరుకుంది.

ఈ సమయంలో రెం డు గజ్జల ప్రాంతాల్లో పెద్ద వాపులు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా, రెండు వైపులా ఇంగ్వైనల్ హెర్నియా ఉన్న ట్లు నిర్ధారించారు. ప్రీమెచ్యూర్ శిశువుల్లో ఊపిరితిత్తులు పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం, శ్వాసకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో అనస్థీషియా ఇవ్వడం వైద్యులకు సవాలుగా మా రింది. శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ప్రాంతీయ అనస్థీషియా పద్ధతిని ఎంచుకున్నారు.

డా. గౌరీ శంకర్, హెచ్‌ఓడీ  అనస్థీషి యా మాట్లాడుతూ.. శిశువుకు అవసరమైన నొప్పి నియంత్రణను అందిస్తూ, జనరల్ అనస్థీషియా, సెడేటివ్ మందుల వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించడమే మా ప్రధాన లక్ష్యం. శిశువు ఆరోగ్య పరిస్థితి, శస్త్రచికిత్స అవసరాన్ని పూర్తిగా అంచనా వేసిన తర్వాత అవేక్ కాడల్ అనస్థీషియాను ఎంచుకున్నాం. శస్త్రచికిత్స సమయంలో శిశువు స్వ యంగా శ్వాస తీసుకుంటూనే స్థిరంగా ఉం దని వైద్య బృందం తెలిపింది. 

మరిన్ని వార్తలు