యాదాద్రి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆలేరు, అక్టోబర్ 27: యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri district)ను కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి, జిల్లా అధ్యక్షుడు కల్లెపు అడివయ్య, ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక, పశువులకు మేత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని కరువు సర్వే నిర్వహించి, ఉపాధి హామీ పనులను 200 రోజులకు పెంచి రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, కరువు నివారణకు తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, ప్రగతిశీల మహిళా సంఘం, ఐఎఫ్‌టీయూ, పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.