స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు
వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం
స్వామివారి నిత్య ఆదాయం 21,74,978/-
స్వామివారిని దర్శించుకున్న ఎన్సిఎస్సి కమిషనర్ ఢిల్లీ జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రస్తుత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం నిత్య పూజలను పండితులు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో స్వయంభు లింగం, స్పటిక లింగాలకు అభిషేకము చేశారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని ఎన్ సి ఎస్ సి కమిషనర్ ఢిల్లీ జి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, దర్శన అనంతరం వేదశీర్వచనం చేసి స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేసిన ఆలయ అధికారులు.