క్రీడాకారుల ఎంపిక
ఖానాపూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా క్రికెట్ అండర్ 17 పోటీల(Under-17 Cricket Tournament)కు నిర్మల్ క్రికెట్ అకాడమీ(Nirmal Cricket Academy)లో గ్రౌండ్లో కొండాపూర్ నందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెలక్షన్స్ను టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా విజేతగా నిలిచి మూడు జిల్లాలపై గెలుపొందడం జరిగింది. దీనికి కోచ్గా వ్యవహరించిన సుదర్శన్ యజ్ఞం సెక్రెటరీ లక్ష్మణ్ అలాగే నాలుగు జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ గెలుపొందిన క్రీడాకారులు గద్వాల్ లో జరిగే రాష్ట్రస్థాయి అండర్ 17 క్రికెట్ పోటీలకు రేపు వెళ్లడం జరుగుతుంది 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన నిర్మల్ జిల్లా ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్య అతిథులుగా ఎం శ్రీనివాస్ రమణారావు గారు రమణ బుచ్చి రామారావు వన్నెల భూమన్న రాష్ట్ర పాల్ సాయి గోపాల్ వివిధ జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.