మారుమూల గ్రామాల్లో మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తాం
బోథ్. అక్టోబర్ 27 (విజయ క్రాంతి) మార్ముల గ్రామాలలో ఉన్న యువత కోసం భవిష్యత్తులో మరిన్ని గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్(Adilabad SP Akhil Mahajan) పేర్కొన్నారు. మంగళవారం సోనాల మండలంలోని మారుమూల గ్రామమైన దేవల నాయక్ తండ గ్రామంలో మూడవ లైబ్రరీని ప్రారంభించారు.
500 పుస్తకాల తో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ 1000 మంది యువతకు ఉపయోగపడుతుందన్నారు. దేవర నాయక్ తండ ఫుల్ సింగ్ నాయక్ తండ పార్టీ బి పార్టీకే సంపత్ నాయక్ తండ గ్రామాల యువత పోటీ పరీక్షల్లో సిద్ధమయ్యేందుకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలన్నారు. యువతకు చదువుకునే అవకాశం ఉంటే ఉన్నదులుగా ఎదిగే ఆస్కారం ఉందని లైబ్రరీలను ప్రారంభిస్తున్నామన్నారు.
సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తమ కుటుంబాలకు బాసటగా నిలవాలని యువతకు సూచించారు. నేరాల వైపు వెళ్లకుండా సరైన మార్గంలో నడిచి సమాజ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని కోరారు.
జిల్లాలో ఇప్పటివరకు లోకారి, చించు ఘాట్ లలో లైబ్రరీలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి ,బోత్ సిఐ డి గురుస్వామి, ఎస్సై వి పురుషోత్తం ,సర్పంచ్ జాదవ్ బాబు సింగ్ ,నాయక్, రామ్ కిషన్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.