కాటేదాన్ ఇండస్ట్రీలో బ్లాస్ట్

27-10-2026 | 06:30pm

హైదరాబాద్: నగరంలోని కాటేదాన్(Katedan) ప్రాంతంలో పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. బాటిళ్ల తయారీ పరిశ్రమ(Bottle manufacturing industry)లో కెమికల్ పేలుడు సంభవించడంతో ముగ్గురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించారు. కాటేదాన్‌లోని బాటిళ్ల తయారీ యూనిట్‌లో పేలుడు సంభవించడంతో పరిశ్రమలో కలకలం నెలకొంది.

ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా, ఒకరికి తీవ్ర గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. బాధితులకు ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిశ్రమలో పేలుడు ఎలా సంభవించింది? కెమికల్స్‌ నిర్వహణలో ఏదైనా లోపం ఉందా? అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారుల విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు