KPHBలో తీవ్ర విషాదం..
27-10-2026 | 06:06pm
హైదరాబాద్: కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(KPHB) పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారిని చంపి ఆమె తల్లిదండ్రులు కూడా ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతులు పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబం మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటన వెనుక కారణాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.