ఘనంగా బతుకమ్మ వేడుకలు
బోథ్. అక్టోబర్ 9 (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Government Junior College) ముందస్తు బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) విద్యార్థులు(Students) ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ సాంప్రదాయం(Telangana Tradition) ఉట్టిపడే విధంగా విద్యార్థులు బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ కోలాటం వేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. పూలను పూజించే ఈ పండుగ తొమ్మిది రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారన్నారు. ఒకవైపు దుర్గా నవరాత్రి ఉత్సవాలు మరో బతుకమ్మ వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తుంది అన్నారు. ప్రోగ్రాం అధికారి నాందేవ్. నగేష్ లు పాల్గొన్నారు