వీడిసి ఆధ్వర్యంలో పిచ్చి మొక్కల తొలగింపు

26-10-2026 | 05:31pm

బోథ్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విడీసీ అధ్యక్షులు అల్లకొండ పోతన(VDC President Allakonda Pothana) ఆధ్వర్యంలో మైదానాన్ని శుభ్రం చేయించారు. మైదానంలో పిచ్చి మొక్కలు పెరగడంతో ఉదయం పూట వాకింగ్ చేసే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలపడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యువకులు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడంతో పాటు పోలీస్ ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు రన్నింగ్ చేస్తుండడంతో వారి సౌలభ్యం కోసం కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వీడిసి కోశాధికారి రాయపల్లి రమాకాంత్, ఉపాధ్యక్షులు యాసిన్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు