విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
26-10-2026 | 07:06pm
అశ్వాపురం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): అమెర్ధ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యల(Power Issues)ను పరిష్కరించాలని ఉపసర్పంచ్ మేకల అంజిబాబు కోరారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.