పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే

26-10-2026 | 07:09pm

కుబీర్ (విజయక్రాంతి): అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో సునీల్‌ దత్‌ గురుస్వామి చేపట్టిన పాదయాత్రను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్(MLA Pawar Ramarao Patel) ప్రారంభించారు. బాసర నుంచి శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధి వరకు చేపట్టిన మహా పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాముల మహా పాదయాత్ర నాలుగోసారి విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు పోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మోళ్ల దత్తాత్రి, బీజేపీ నాయకులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు