సహకార సంఘం పీఠం పై ఉత్కంఠత
రెడ్డి సామాజిక వర్గానికి కేటాయింపు.?
బోథ్. అక్టోబర్ 29 (విజయ క్రాంతి) బోథ్ మండల సహకార సంఘం(Boath Mandal Cooperative Society) చైర్మన్ గిరి పైన ఉత్కంఠత నెలకొంది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 28 సహకార సంఘాల చైర్మన్ పదవుల నియామకం దాదాపు పూర్తి అయినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది.
అయితే ఈ విషయం జిల్లా ఇన్చార్జి మంత్రి వద్ద పదవుల ఎంపిక ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత దీపావళికి పదవుల పంపకాలు జరగనున్నాయని తెలిసింది....
బోథ్ చైర్మన్ పదవి పై పట్టు...
మండల సహకార సంఘం చైర్మన్ పదవిని తమ అనుచరులకు కట్టబెట్టేందుకు జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయినాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి తో పాటు జిల్లా అధ్యక్షులు ,మాజీ ఎంపీ సహితం తమ అనుచరులకు పదవులను ఇప్పించేందుకు కృషి చేస్తున్నారు.
బోథ్ మండల కన్వీనర్ బిసి వర్గానికి కేటాయించగా ఆత్మ చైర్మన్ పదవితో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ సహితం బీసీలకు కట్టబెట్టారు. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులకు సహకార సంఘం చైర్మన్ పదవిని కేటాయిస్తే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి మరింత దగ్గరవుతుందని ఆది నాయకులు ఆలోచిస్తున్నారు.
ఇది సెగ అధిష్టానం వద్ద కొంతమంది నాయకులు తమ వాదన వినిపించినట్లు తెలిసింది. నియోజకవర్గ ఇన్చార్జి మాత్రం బోత్ చైర్మన్ పదవిపై పట్టు పట్టినట్లు తెలిసింది. అయితే స్థానిక చైర్మన్ పదవి విషయంలో జిల్లా ఇన్చార్జి మంత్రి నిర్ణయం తుది నిర్ణయం గా కోరుకుంటున్నారు....
ఏక అభిప్రాయం కుదరక....
సహకార సంఘం పదవి విషయంలో నాయకులు వారి వారి అనుచరులకు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండడంతో ఆది నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని ఆ పార్టీకి చెందిన నాయకులంటున్నారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే పార్టీకి పనిచేసే వారికే పదవులను ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తున్నది.
రైతులతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారికి పదవులను కేటాయిస్తే తగు న్యాయం చేసినట్లు అవుతుందని ఆ పార్టీకి చెందిన నాయకులంటున్నారు. ఏది ఏమైనా సహకార సంఘం చైర్మన్ పదవి కేటాయింపు పై ఉత్కంఠత నెలకొంది. దీపావళి వరకు జాబితా తుది రూపం దాల్చుతుందని అంటున్నారు.