సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

26-11-2026 | 08:29pm

బోథ్. నవంబర్ 26 ( విజయక్రాంతి) హైదరాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ(All India Congress Party) పిలుపుమేరకు టిపిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన సంవిధాన రక్షకు ర్యాలీలో నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. లిబర్టీ సర్కిల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన భారీ పాదయాత్రలో నాయకులతో కలిసి పాల్గొన్నారు.

కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్, టి పి సి సి ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మీరు భోజన్న, మురళి గౌడ్, ఎండి సద్దాం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు