సమగ్ర చట్టం కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
మహబూబాబాద్: కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం(Comprehensive Law) చేయాలని డిమాండ్ చేస్తూ బి కే ఎం యు, ఏఐకేఎస్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్(District Collectorate) ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బి కే ఎం యు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల వెంకన్న, కట్టబోయిన శ్రీనివాస్, ఏఐకేఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మేక వీరన్న, నెల్లూరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి నరేంద్ర మోడీ సర్కార్ కోట్లాదిమంది వ్యవసాయ కార్మికుల కోసం వ్యవసాయ సమగ్ర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కార్మిక ,రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశ ప్రజలను వంచిస్తుందన్నారు. పోరాడి సాధించుకున్నటు వంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం కోసం బడ్జెట్ కేటాయించకుండా కోట్లాది మంది ఉపాధి కూలీలను మోసం చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హామీ మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలుపరిచి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు సంవత్సరానికి 12,000 ఇవ్వాలని కోరారు.
మహిళలకు చేయూత పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న నిరుపేదలందరికీ ఇండ్ల పట్టాలి ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మామిండ్ల సాంబలక్ష్మి, కొమ్ము నారాయణ, జంపాల వెంకన్న, బసవ కొంరయ్య, ఉప్పరి కవిత హలీమా, కృష్ణమూర్తి, హరినాయక్, గిరి, రాజేష్, లోకేష్, భీముడు, తదితరులు పాల్గొన్నారు.