రాజ్యాంగ పరిరక్షణ కోసం “సంవిధాన్ రక్షక్ మార్చ్”
పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్, నవంబర్ 26 ( విజయక్రాంతి ): రాజ్యాంగ దినోత్సవాన్ని(Constitution Day) పురస్కరించుకుని రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో లిబర్టీ వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన “సంవిధాన్ రక్షక్ మార్చ్” కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ సందీప్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.