డ్రగ్స్‌కు నో చెప్పండి.. కిషన్ రెడ్డి యాత్రకు సెలబ్రిటీల మద్దతు

26-11-2026 | 02:49pm

హైదరాబాద్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’(Hyderabad Walks for Nasha Mukt Bharat) కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. గురువారం ముషీరాబాద్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, హిమాయత్ నగర్, లిబర్టీ, ఖైరతాబాద్ మీదుగా అమీర్‌పేటలోని సత్యం థియేటర్ వరకు కొనసాగుతోంది.

యువతకు గోపీచంద్ సందేశం

ఈ కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ జట్టు చీఫ్ నేషనల్ కోచ్ పుల్లెల గోపీచంద్(Pullela Gopichand) పాల్గొని యువతకు కీలక సందేశమిచ్చారు. క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

చిరంజీవి, సుమ మద్దతు

ఈ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమానికి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మద్దతు ప్రకటించారు. ‘లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి’ అంటూ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశం పంపారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala) కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ సైతం నషాముక్త్ భారత్ ప్రచారానికి తన సంఘీభావం ప్రకటించారు.

మరిన్ని వార్తలు