ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సైబరాబాద్ మూవ్స్ షురూ
హైదరాబాద్: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ తిప్పలు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. పెరుగుతున్న వాహనాల రద్దీకి పరిష్కారాలు అన్వేషించడంతో పాటు ప్రజా రవాణాను బలోపేతం చేసే లక్ష్యంతో ‘సైబరాబాద్ మూవ్స్ 2026’ సదస్సు(Cyberabad Moves 2026 Summit) గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాయదుర్గంలోని టీ-హబ్ వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్(Telangana DGP CV Anand) ప్రారంభించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన(Municipal Corporation Commissioner G. Srujana), సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేశ్‌తో పాటు పలువురు అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
సైబరాబాద్ పరిధిలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, ప్రైవేట్ వాహనాల వినియోగం, వాయు కాలుష్యాన్ని తగ్గించడంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. బస్సులు, మెట్రో సేవల అనుసంధానం, కార్‌పూలింగ్, పాదచారులకు అనుకూలమైన రహదారులు, చివరి మైలు కనెక్టివిటీ వంటి అంశాలపై నిపుణులు చర్చించనున్నారు.
ప్రభుత్వ అధికారులు, రవాణా రంగ నిపుణులు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, పౌర సంఘాలకు ఈ వేదికలో భాగస్వామ్యం కల్పించారు. నగర ప్రయాణ సమస్యలకు వినూత్న పరిష్కారాలను సూచించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 28 వరకు కొనసాగనున్న సైబరాబాద్ మూవ్స్ కార్యక్రమం ద్వారా ఐటీ కారిడార్‌లో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా మార్చేందుకు కార్యాచరణ దిశగా అడుగులు పడనున్నాయి.