మండల టాపర్ కు నగదు అందజేత..

26-11-2026 | 08:22pm

తాడ్వాయి,నవంబర్,26( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని(Tadwai Mandal Headquarters) ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని నామాల నవ్యశ్రీ కి రూ.10 వేలు నగదు అందించారు. మండల టాపర్ గా నిలిచిన ఆమెను పలువురు ప్రతినిధులు అభినందించారు.శ్రీరామా లైఫ్ ఇన్సూరెన్స్ వారు అందించిన నగదును విద్యార్థికి అందజేశారు. ప్రతి విద్యార్థి టాపర్ గా నిలవాలని ప్రతినిధులు కోరారు.విద్యార్థులు మండల టాపర్ లే కాకుండా జిల్లా స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించాలని కోరారు.

ప్రతి విద్యార్థి కష్టపడి చదివినట్లయితే మంచి భవిష్యత్ ఉంటుందని వారు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ రామ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టర్ లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి,గ్రామ సర్పంచ్ మెట్టు విజయరాములు, ఉపసర్పంచ్ రనిల్ రెడ్డి, వీడిసి చైర్మన్ మేకల రాజు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింలు, నాయకులు అంబీర్ శ్యామ్ రావు,శ్రీరాం లైఫ్ ఇన్సూరెన్స్ ఏరియా మేనేజర్ శంకర్ నాయిని, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు