డిగ్రీ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
30-10-2026 | 04:06pm
బేల అక్టోబర్ 30 (విజయక్రాంతి): మండల కేంద్రంలో కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకుడు మాడావార్ హరీశ్ రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కోరారు. ఆదిలాబాద్‌కు వెళ్లి పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.