పోటెత్తిన జనం.. మోదీ మాస్ షో

30-10-2026 | 11:18am

గుజరాత్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా శుక్రవారం బనస్కాంత జిల్లాలోని భిల్డి పట్టణంలో నిర్వహించిన Roadshow ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల State Visitలో భాగంగా అక్కడికి చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి మోదీకి అభివాదం చేశారు. హెలిప్యాడ్ నుంచి బనాస్ డెయిరీ ప్లాంట్ వరకు ప్రధాని Open Jeepలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి ఆయన వెంట ఉన్నారు. మోదీని చూసేందుకు వచ్చిన ప్రజలు నినాదాలతో పరిసరాలను హోరెత్తించగా, ప్రధాని చిరునవ్వుతో చేతులు ఊపుతూ వారికి అభివాదం చేశారు.

ఈ పర్యటనలో భాగంగా గుజరాత్‌లో సుమారు రూ.14,000 కోట్ల విలువైన Development Worksకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అంతేకాకుండా రైతులకు ఎంతో కీలకమైన PM-KISAN Scheme 24వ విడత నిధులను కూడా విడుదల చేయనున్నారు. దీంతో మోదీ పర్యటనపై రైతులు, స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలతో నేరుగా మమేకమయ్యేలా నిర్వహించిన ఈ Roadshow భిల్డిలో ప్రత్యేక సందడిని తీసుకొచ్చింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో పట్టణంలో పండగ వాతావరణం కనిపించింది.

మరిన్ని వార్తలు