ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించండి

27-11-2026 | 04:09pm

బోథ్. నవంబర్ 27 (విజయ క్రాంతి): జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను(National health programs) అమలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంతో పని చేయాల్సి ఉందని జిల్లా వైద్యాధికారి  సాధన పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న రైతు వేదిక లో వైద్య సిబ్బంది ఏఎన్ఎం, హెల్త్ అసిస్టెంట్లు, ఆశ వర్కర్లకు శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అందించాలన్నారు. గ్రామస్థాయిలో ఉన్న వైద్య సిబ్బంది ఆశ వర్కర్లు ప్రతి ఒక్కరి ఆరోగ్యం పై దృష్టి సారించాల్సిందన్నారు.

వివిధ రకాల వ్యాధుల బారిన పడ్డవారిని గుర్తించి వారికి వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంహెచ్ఎన్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నీలోఫర్, ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీ, జిల్లా ప్రోగ్రాం అధికారి జాదవ్ దేవిదాస్ నాయక్, ఐ డి ఎస్ అధికారి డాక్టర్ అశోక్, డీసీఎం రాజ్ కుమార్ బోత్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పీహెచ్ సెలక్షన్ విద్యా సిబ్బంది స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవీంద్ర ప్రసాద్  పాల్గొన్నారు

మరిన్ని వార్తలు