బంజారా సేవా దళ్ నూతన కమిటీ
27-11-2026 | 03:33pm
రాజాపూర్ నవంబర్ 27: ఈ నెల 29వ తేదీన జిల్లా కేంద్రం లో(District headquarters) నిర్వహించు మండల బంజారా సేవా దళ్ నూతన కమిటీని(New Committee of the Banjara Seva Dal) ఏర్పాటు చేయనున్నట్లు సంఘం నాయకులు పలుగుట్ట తండా చిన్నబాబు నాయక్ శుక్రవారం ప్రకటన ద్వారా తెలిపారు.
ఈకార్యక్రమానికి రాష్ట్ర స్థాయి బంజారా సేవా దళ్ నాయకుల సమక్షంలో మండల నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారితో కూడిన పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రతి తండా నుంచి గిరిజన యువకులు, మేధావులు, పెద్దలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.