దీక్షా దివస్‌కు తరలిరండి

27-11-2026 | 12:22pm

దీక్ష దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి 


దమ్మపేట, నవంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టమని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు దొడ్డా రమేష్ అన్నారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్ష ఉద్యమంలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన ఆ పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను స్మరించుకోవడమే దీక్షా దివస్(BRS Deeksha Divas) ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ నెల 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలోని సాయిరంగా ఫంక్షన్ హాల్ వద్ద దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దొడ్డా రమేష్ వెల్లడించారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ పరిశీలకులు ఉప్పల వెంకటరమణ, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుందని వివరించారు. ఈ కార్యక్రమానికి దమ్మపేట మండలంలోని పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీల నాయకులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ప్రతి గ్రామం నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దొడ్డా రమేష్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు