మృతదేహానికి పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి నివాళి
నర్సంపేట, నవంబర్ 27( విజయ క్రాంతి ): నెక్కొండ మండలంలోని దీక్షకుంట్ల గ్రామానికి చెందిన ఎస్సై అనంతగిరి మధు(SI Anantagiri Madhu) తల్లి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి గ్రామానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కార్యక్రమంలో నాయకులు కొమ్ము రమేష్ యాదవ్, జాటోత్ రమేష్ నాయక్, కట్కూరి నరేందర్ రెడ్డి, మాదాసు రవి, కారింగుల సురేష్ గౌడ్, అలకుంట సురేందర్, యాసం బాలకిషన్, దేవానబోయిన వీరభద్రం, ఈదునూరి దిలీప్, సేలంద్ర ఓంకార్,తదితరులు పాల్గొన్నారు.