గురుకులంలో ‘ప్రసవం’.. ఇద్దరిపై వేటు

27-11-2026 | 12:23pm

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం ఓ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై గురుకులాల సొసైటీ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనకు బాధ్యులుగా గుర్తిస్తూ ఏఎన్ఎం నీల ను సస్పెండ్ చేశారు. అలాగే హౌస్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న గెస్ట్ లెక్చరర్ చైతన్యను టెర్మినేట్ చేశారు. గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించేంతవరకు గమనించకపోవడాన్ని నిర్లక్ష్యంగా పరిగణిస్తూ ప్రిన్సిపల్ బిందు మాధురి కి షోకజ్ నోటీసు జారీ చేశారు. పూర్తి నివేదిక అనంతరం మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు గురుకుల సొసైటీ ప్రాంతీయ కోఆర్డినేటర్ నారాయణ నాయక్ తెలిపారు.

మరిన్ని వార్తలు