అమెరికాలో బతుకమ్మ ఆడిన విద్యార్థులు
22-10-2026 | 08:06pm
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కౌట (బి) గ్రామానికి చెందిన వెండి వంశిక అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నది. అయితే ప్రతి ఏటా బతుకమ్మ పండుగ అని సొంత గ్రామంలో ఘనంగాజరుపుకుంటారు. అయితే ఆడబిడ్డలకు అత్యంత ఇష్టమైన బతుకమ్మ పండుగ అని అమెరికాలో స్నేహితుల తో కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. తెలుగింటి ఆడబిడ్డలు ఎక్కడ ఉన్న బతుకమ్మను మాత్రం మరిచిపోకుండా పూల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.