నూతన సీఐ పి. కిరణ్ కు శుభాకాంక్షలు
ఘట్ కేసర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ గా(Ghatkesar Inspector) నూతనంగా బాధ్యతలు చేపట్టిన పి. కిరణ్ ని ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఘట్కేసర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి,
సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు జన చైతన్య సేవా సమితి తరపున తమ పూర్తి సహకారం అందిస్తామని యాదగిరియాదవ్ సీఐ కిరణ్ కి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పోలీసు శాఖతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో ఘట్కేసర్ మాజీ వార్డు సభ్యులు బర్ల దేవేందర్ ముదిరాజ్, ఈడబ్ల్యూఎస్ కాలనీ అధ్యక్షులు కేశవపట్నం అంజనేయులు, మేడిపాటి నగర్ అధ్యక్షులు సుబ్బారావు, జన చైతన్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సార శ్రీనివాస్ గౌడ్, దంతాల అనిల్ కుమార్, నాగభూషణంచారి, సోమసాని వెంకటేష్, అహ్మద్, చిత్తరంజన్, గోరకంటి రవీందర్, లింగం,అబ్బసాని ప్రవీణ్, కడపోల మధు, మొల్గారం గణేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.