రైతులకు అందుబాటులోకి వరి కొనుగోలు కేంద్రాలు
తాసిల్దార్ జ్ఞాన జ్యోతి.
చేగుంట అక్టోబర్ 22. విజయక్రాంతి: రైతులకు మద్దతు ధర కల్పించి, వారి పంటలను సజావుగా కొనుగోలు చేసేందుకు మాసాయిపేట పట్టణ కేంద్రం తో పాటు , అచంపేట గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను(Paddy Procurement Centers) .తహసీల్దార్ జ్ఞానజ్యోతి గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ పసుల వెంకటేష్, పిఎసిఎస్ సొసైటీ డైరెక్టర్ ఉదండపురం నర్సింలు,తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఊదండపురం నర్సింలు,
ఆర్ఐలు, మాసాయిపేట పంచాయతీ కార్యదర్శి రాణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.