మన్ననూర్(మౌనూర్) ఐటీడీఏ అధికారుల బృందం పరిశీలన..

23-09-2026 | 08:42pm

ఉట్నూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఐటీడీఏ, మన్ననూరు(మౌనూర్) ఐటీడీఏ అధికారుల బృందం ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులతో విడివిడిగా భేటీ అయ్యారు. మన్ననూరు ఐటీడీఏ మేనేజర్ జాఫర్ హుస్సేన్(ITDA Manager Jaffer Hussain) ఆధ్వర్యంలో పర్యటిస్తున్న బృందంలో ఇంజనీరింగ్, విద్యా, జాబ్స్, ఉద్యానశాఖ, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వంటి విభాగాల అధికారులతో ఉట్నూర్ ప్రాంతంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చర్చించారు. 

మన్ననూరు ఐటీడీఏ కి నూతనంగా ప్రాజెక్ట్ అధికారి గా బాధ్యతలు తీసుకున్న సలోని చాబ్రా ఐఏఎస్  ఆదేశాల తో పర్యటిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆదిలాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ గా పని చేసిన ఆమెకు కొంత ఉట్నూర్ ఐటీడీఏ లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల పట్ల అవగాహన ఉండటంతో ప్రత్యేకంగా అక్కడి సిబ్బందిని పంపించారు. 

ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు ఆదేశాలతో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ( ఏపీవో జనరల్ )అధికారి జాదవ్ వసంత్ రావు  ఆధ్వర్యంలో అన్ని విభాగాల అధికారులతో చర్చించారు. అసిస్టెంట్ ప్రాజెక్ట్ అధికారి వసంత్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తానాజీ, డీటీడీవో అశోక్, జేడీఏం నాగభూషణం, జీసీసీ డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్, పేసా కోఆర్డినేటర్ వసంతరావు, జీసీడీవో ఛాయా తదితరులు వారి పరిధిలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేసారు. మన్ననూరు నుండి వచ్చిన అభిలాష్, మెడికల్ ఆఫీసర్, జాఫర్ హుస్సేన్, మేనేజర్ ఐటీడీఎ, మన్ననూరు, కళ్యాణ్, SCRP, సేవ్యా నాయక్, ప్రోగ్రాం మేనేజర్ NHM తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు