విగ్నేశ్వరునికి బిఆర్ఎస్ నాయకుడు డాక్టర్ భద్రారెడ్డి ప్రత్యేక పూజలు
23-09-2026 | 08:47pm
ఘట్ కేసర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లోని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపంలో వినాయక విగ్రహంను బిఆర్ఎస్ పార్టీ నాయకుడు డాక్టర్ చామకూర భద్రారెడ్డి(BRS party leader Dr. Chamakura Bhadra Reddy) స్థానిక నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మాజీ ఎంపిటిసి మేకల నర్సింగ్ రావు, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎజ్జల కృష్ణ, పడిగం ప్రవీణ్, ఎజ్జల రఘు, గడ్డం కృష్ణ, మంత్రి చరణ్, మామిండ్ల చందర్, పడిగం యశ్వంత్, జవాజీ వినిల్, మేకల ఓం ఆదిత్య, ఎజ్జల రవి ఎజ్జల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.