ముగిసిన మండల స్థాయి క్రీడా పోటీలు
జుక్కల్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మూడు ప్రభుత్వ పాఠశాలలో మూడు రోజులపాటు మండల స్థాయి క్రీడ పోటీలు(Mandal level sports competitions) నిర్వహించినట్లు ఎంఈఓ తిరుపతయ్య తెలిపారు. ఈనెల 21న జడ్పీహెచ్ఎస్ జుక్కల్, వివేకానంద పాఠశాలలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. 22న యూపీఎస్ మహమ్మదాబాద్ లో ఖోఖో నిర్వహించారు. 23న పీఎం శ్రీ జడ్.పి.హెచ్.ఎస్ ఖండేబల్లూర్ లో వాలీబాల్ పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా క్రీడలు నిర్వహించిన జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, పిఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ ఖండేబల్లూర్ ప్రధానోపాధ్యాయులు లాలయ్య, వివేకానంద పాఠశాల మేనేజ్మెంట్ చంద్రకాంత్, యుపిఎస్ మామదాబాద్ ప్రధానోపాధ్యాయులు గోపాల్ లను బహుమతులు అందజేశామన్నారు. బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఖండేబల్లూర్ సర్పంచ్ కృష్ణ, కౌలాస్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి, మహమ్మదాబాద్ శ్రీనివాస్, జనార్దన్ కేజీబీవీ ఎస్ఓ హాజరయ్యారు.
విజేతలు :
కబడి: బాయ్స్ అండర్ 17 లో జుక్కల్ ప్రథమ స్థానం, జడ్పీహెచ్ఎస్ పెద్ద ఎడ్గి ద్వితీయ స్థానం అదేవిధంగా అండర్17 గర్ల్స్ విభాగంలో పెద్ద ఎడ్గి ప్రథమ స్థానం, కేజీబీవీ ద్వితీయ స్థానం సాధించడం జరిగింది.
అండర్ 14 లో జడ్పీహెచ్ఎస్ జుక్కల్ ప్రథమ స్థానం, వివేకానంద ద్వితీయ స్థానం రావడం జరిగింది.
ఖోఖో : అండర్ 17 బాయ్స్ లో పెద్ద ఎడ్గి ప్రథమ స్థానం, అండర్ 17 లో గర్ల్స్ లో పెద్ద ఎడ్గి ప్రథమ స్థానం, అండర్ 14 బాయ్స్ లో పెద్ద ఎడ్గి ప్రథమ స్థానం, మహమ్మదాబాద్ ద్వితీయ స్థానం రావడం జరిగింది. గర్ల్స్ విభాగం లో కూడా పెద్ద ఎడ్గి ప్రథమ స్థానం, కేజీబీవీ ద్వితీయ స్థానం సాధించడం జరిగింది.
వాలీబాల్ అండర్ 17 పోటీలు :
జడ్పీహెచ్ఎస్ ఖండేబల్లూర్ ప్రథమ స్థానం, జడ్పీహెచ్ఎస్ జుక్కల్ ద్వితీయ స్థానం రావడం జరిగింది. అండర్ 14 గర్ల్స్ లో ప్రథమ స్థానం జుక్కల్ ద్వితీయ స్థానం కౌలాస్ పాఠశాలలకు లభించింది.