గంగ నీళ్లతో ఊరు పోచమ్మ తల్లి నగల శుద్ధి
19-10-2026 | 05:59pm
బోథ్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మండలంలోని కౌటాభి గ్రామం(Koutabhi Village)లో సోమవారం ఉదయం గంగ నీళ్లతో ఊరు పోచమ్మ నగలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పి అశోక్ రెడ్డి నూతనంగా గెలుపొందిన గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లెపూల రమేష్ కు నగల వివరాలను అందించారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు గ్రామ నాయకులు మహిళలు పాల్గొన్నారు.